కర్నూలులో కప్పల వర్షం..

కర్నూలులో కప్పల వర్షం..
x
Highlights

వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం కానీ కప్పల వర్షం పడే దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా..? కర్నూలు జిల్లాలో అలాంటి దృశ్యమే కనిపించింది. ఒకటి...

వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం కానీ కప్పల వర్షం పడే దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా..? కర్నూలు జిల్లాలో అలాంటి దృశ్యమే కనిపించింది. ఒకటి కాదు,10 కాదు.. 20 కాదు ఏకంగా వందల సంఖ్యలో కప్పలు ఏకధాటిగా ఆకాశం నుంచి మీదపడ్డాయి. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం ముకుందాపురం గ్రామంలో తెల్లవారు జామున కురిసిన తేలికపాటి వర్షంలో కప్పలు కూడా భారీగా వచ్చి చేరాయి. నారుమడి కోసం తయారు చేసిన పొలంలో ఎక్కడ చూసినా పసుపు రంగులో ఉన్న కప్పలు ఎగురుతూ కనిపించడంతో అక్కడవున్న రైతులు ఆశ్చర్యపోయారు. నైరుతి రాకతో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండటంతో పొలం పనులకు రెడీ అవుతున్నారు రైతులు.

పొలాలకు వచ్చిన రైతులకు వింత అనుభవం ఎదురుకావడంతో అవాక్కయ్యారు. వర్షంతో పాటు కప్పలు కింద పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. కప్పల వర్షం కురిసినట్లు ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఈ వింతను చూసేందుకు స్ధానికులు తరలివస్తున్నారు. అయితే భారీ సుడిగాలులకు నీటితోపాటు కప్పులు కూడా ఆకాశంలోకి వెళ్లి వర్షంతోపాటు పడి ఉంటాయని మరికొందరు అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories