ఉచిత వైద్య శిబిరం
పట్టణంలో కొంగలవీడు రోడ్డులో గల విశ్వభారతి పాఠశాలలో ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గం. నుండి మధ్యాహ్నం 1.30 గం. వరకు..
గిద్దలూరు: పట్టణంలో కొంగలవీడు రోడ్డులో గల విశ్వభారతి పాఠశాలలో ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గం. నుండి మధ్యాహ్నం 1.30 గం. వరకు నద్యాల నెరవాటి వైద్యశాల వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
శిబిరాన్ని గిద్దలూరు శాసనసభ్యులు అన్నావెంకట రాంబాబు ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా నెరవాటి వైద్యశాల అధినేత నెరవాటి సత్యనారాయణ పాల్గొంటారని కన్వీనర్ సూరె చెంచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మందులు కూడా వైద్యం చేయించుకున్న వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.
Next Story




