సచివాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొల్లబాబురావు

సచివాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొల్లబాబురావు
x
ఎమ్మెల్యే గొల్ల బాబురావు
Highlights

పట్టణంలో గ్రామ సచివాలయానికి స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు శంకుస్థాపన చేశారు.

పాయకరావుపేట: పట్టణంలో గ్రామ సచివాలయానికి స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు శంకుస్థాపన చేశారు. పట్నంలో ఐదు సచివాలయానికి నిర్మాణానికి గాను, తొలుత జి.వి.ఆర్ నగర్ లో సచివాలయానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ... సీఎం జగన్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఏర్పాటుకు, ఉద్యోగ నియమకాలను చేపట్టారని అన్నారు.

ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం దగ్గరగా ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిక్కాల రామారావు, మండల, పట్టణ అధ్యక్షులు దనిశెట్టి బాబు, దగ్గుపల్లి సాయి, సిడిసి మాజీ ఛైర్మన్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories