దానికోసం జగన్ కాళ్ళు పట్టుకుంటా : బంగి అనంతయ్య

దానికోసం జగన్ కాళ్ళు పట్టుకుంటా : బంగి అనంతయ్య
x
Highlights

పేదల ఆకలి తీర్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది . అయితే దీనిపైన ప్రతిపక్షం అయిన టీడీపీ...

పేదల ఆకలి తీర్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది . అయితే దీనిపైన ప్రతిపక్షం అయిన టీడీపీ నిరసనకు చేపట్టింది . పేదల ఆకలి తీర్చేందుకు ఈ పధకాన్ని అప్పుడు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందని దీనిని ఆపివేయకూడదని కొనసాగించుకోవాలని టీడీపీ ఆందోళనకి దిగింది . బడ్జెట్ సమావేశంలో కూడా టీడీపీ దీనిపైన ప్రధానంగా చర్చ జరిపింది .అయితే తాజాగా అన్న కాంటీన్ల మూసివేతను నిరసిస్తూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఇంటింటికి తిరుగుతూ బిక్షాటన చేసారు . వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్ లను మూసివేయడం అన్యాయమని, కావాలంటే వేరే పేరుతో వీటిని కొనసాగించాలని అయన అన్నారు . దీనిని రాజకీయం చేయొద్దని అయన చెప్పుకొచ్చారు . అన్న కాంటీన్ల తెరిచే వరకు నిరసన కొనసాగిస్తానని , అవసరం అయితే జగన్ కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధమని ఆయన అన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories