గుంటూరు మాజీ ఎంపీ రాయపాటికి తీవ్ర అస్వస్థత

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటికి తీవ్ర అస్వస్థత
x
Highlights

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం సాంబశివరావుకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్...

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం సాంబశివరావుకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ కావడంతో ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. రాయపాటి అస్వస్థతకు గురయ్యాని తెలియడంతో టీడీపీ ముఖ్యనేతలు కుటుంబ సభ్యుల్ని ఫోన్‌లో పరామర్శించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా బ్యాంకుల‌కు రుణాల ఎగ‌వేత కేసులో రాయ‌పాటిని సీబీఐ విచారిస్తోన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు చేజిక్కించుకున్న‌ రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ‌..బ్యాంకుల నుంచి ‌ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు పేరు చెప్పి ఆయన్ను బెదిరించి.. డబ్బు దోచుకోవాలని చూసిన వ్యవహారంలో చిక్కుముడి వీడుతోంది. మలయాళ నటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్‌లను ఈ కేసులో సీబీఐ అధికారులు అసలు సూత్రధారులుగా గుర్తించారు. దీంతో వీరి అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories