గోదావరి మళ్లీ ఉగ్రరూపం

గోదావరి మళ్లీ ఉగ్రరూపం
x
Highlights

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగి భయపెడుతోంది... క్షణ, క్షణం వరద పెరుగుతుండటంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి.. vEKW...

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగి భయపెడుతోంది... క్షణ, క్షణం వరద పెరుగుతుండటంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి.. vEKW భారీ వరదలకు పోలవరం పరిధిలో ఉన్న ముంపు గ్రామాలు నీట మునిగిపోయాయి. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఉగ్ర గోదావరి ధాటికి కోనసీమలోని లంక గ్రామాలు వణికిపోతున్నాయి. దేవీపట్నం మండలంలోని గ్రామాల్లోకి వరద నీరు మరింతగా చేరింది. దండంగి, దేవీపట్నంలో అధికారులు పడవలను నిలిపివేశారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద నీరు తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ పెరుగుతోంది. 44.60 అడుగుల నీటిమట్టం నమోదవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరితో పాటు శబరి, సోకులేరు, పాములేరు తదితర కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 13.56 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గురువారానికి 13.57 మీటర్లకు అనూహ్యంగా పెరిగిపోయింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి అనూహ్యరీతిలో పెరగడంతో పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే కడెమ్మ స్లూయీస్‌ వంతెన మరోమారు నీటి మునిగింది. దీంతో ఏటిగట్టుకి గండిపడే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎగువన 19 ఏజెన్సీ గ్రామాలు గత 12 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. తాజాగా మళ్లీ పెరిగిన వరద వల్ల కుక్కునూరు మండలంలోని విజ్జరం, ముత్మాలమ్మపాడు మధ్య గల కాజ్‌వేపైకి నీరు చేరి పది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద పాటు రేవు కాజ్‌ వే మునిగిపోవడంతో పెద్దపట్నలంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐ.పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంక గ్రామాలకు బాహ్య ప్రపంచతో సంబంధాలు తెగిపోయాయి. అయినవిల్లి, పి.గన్నవరంలలో పలు చోట్ల కాజ్‌ వేలు ముంపునకు గురవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం మండలంలోని పల్లవారి పాలెం ఏటిగట్టు దిగువున ఉన్న లంకాఫ్‌ఠాణేల్లంక, కమిని, కూనాల్లంక, సలాదివారిపాలెం, చింతన లంక, గురజాపులంకకు రహదారిపైకి వరద నీరు చేరింది. ఇక సీఎం జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముంపు బాధిత కుటుంబాలకు 5వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు, ఆహారం అందజేయాలని అధికారులకు ఆదేశించారు. మొత్తానికి గోదావరి ఉధృతి క్రమేపీ పెరుగుతుండటంతో.. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియక లంక ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories