Top
logo

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు
X
Highlights

విజయవాడలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు రావడంతో కరకట్ట దగ్గర...

విజయవాడలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు రావడంతో కరకట్ట దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చింది. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌ మెట్లపైకి నీళ్లు రావడంతో ఆందోళన మొదలైంది. దీంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ను పై ఫ్లోర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు కాన్వాయ్‌ను కూడా అక్కడి నుంచి తరలించారు. ఇటు వరద ముంపుకు గురైన చంద్రబాబు నివాసాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. మరోవైపు కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో చాలావరకు ముంపుకు గురయ్యాయి. చాలా నిర్మాణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు నిర్మాణాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Next Story