శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద నీరు
x
Highlights

శ్రీశైలం డ్యాంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృఫ్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కృష్ణానదికి చేరుతుంది.

శ్రీశైలం డ్యాంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృఫ్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కృష్ణానదికి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యాం జలకళ సంతరించుకుంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుసార్లు డ్యాం క్రస్ట్‌గేట్లను తెరచి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం మరోమారు గేట్లను తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

ప్రస్తుతం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. 1.60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. ఈ ఏడాది జూలై 30న జలాశయానికి నీటిప్రవాహం ప్రారంభమైంది. ఆగస్టు 9 కంతా డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో క్రస్ట్‌గేట్లను తెరచి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తిరిగి రెండోసారి సెప్టెంబరు 9వ తేదిన క్రస్ట్‌గేట్లను తెరచి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేశారు. సెప్టెంబరు 19న మూడోసారి క్రస్ట్‌గేట్లను తెరచి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేశారు. సెప్టెంబరు 26న మరోసారి, అక్టోబరు 9న మరోసారి క్రస్ట్‌గేట్లను తెరచారు. ప్రస్తుతం జలాశయానికి వరద పెరగడం ఆదివారం 6వసారి క్రస్ట్‌గేట్లను తెరిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories