ఏపీలో మూడు రాజధానులపై తొలిసారి నోరు విప్పిన ప్రధాని మోదీ..

ఏపీలో మూడు రాజధానులపై తొలిసారి నోరు విప్పిన ప్రధాని మోదీ..
x
First Time PM Narendra Modi has Responded to the Issue of the Three Capitals
Highlights

ఎపీ సీఎం జగన్ పరిపాలనా దక్షతలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసారు.

ఎపీ సీఎం జగన్ పరిపాలనా దక్షతలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసారు.ఈ లేఖలో కొంత కాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి 3 రాజధానులను నిర్మిస్తే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదరుకునే పరిస్థితి వస్తుందని ఆయన లేఖలో రాసారు. మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నతరువాత రాష్ట్ర రాజధానిగా విభజన చట్టం ప్రకారం అమరావతి ఖరారైందని లేఖలో ప్రధానికి రాసారు. సీఎం పరిధిలో లేని అంశంపై వారికి జోక్యం అనవసరం అని, అయినప్పటికీ చొరవ తీసుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ ప్రయాత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలన్నారు. ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు.

కనమేడల రాసిన లేఖ ప్రధానికి అందగాను ఆయన స్పందించారు. మూడు రాజధానుల అంశంపై రాసిన లేఖ తమకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని సమాధానం ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏపీ రాజధానులపై స్పందించని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీ లేఖకు ప్రత్యేకంగా స్పందించి సమాధానం ఇవ్వడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖను అడ్మినిస్ట్రేటివ్, అమరావతిని లెజిస్లేటివ్, కర్నూలు జ్యుడిషయల్ కేపిటల్స్‌గా నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో అమరావతిలో రైతులు గత మూడు నెలలుగా ఆందోళనల్ని చేస్తున్నారు. ఇక ఈ విషయం హైకోర్టుకు చేరడంతో ప్రస్తుతానికి తరలింపు అంశం పెండింగ్‌లో ఉంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories