అవినీతి నిర్మూలనలో తొలిఅడుగు..

అవినీతి నిర్మూలనలో తొలిఅడుగు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అవినీతి నిర్మూలన దిశగా తొలి అడుగు వేసింది ఏపీ ప్రభుత్వం....

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అవినీతి నిర్మూలన దిశగా తొలి అడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. కాంట్రాక్టు పనుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి ని నిరోధించేందుకు చర్యలు ప్రారంభించింది. దీని కోసం అన్ని శాఖలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టులు చేజిక్కించుకుని ఏప్రిల్ 1 వ తేదీ నాటికి పనులు మొదలు పెట్టని పనులన్నిటినీ రద్దు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా పనులు మొదలై 25 శాతం లోపు పనులు మాత్రమే జరిగిన కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపు నిలుపు చేయాలని ఆదేశించారు. జీరో కరప్షన్ మోడ్ తో పనిచేశేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎఫ్.ఆర్.ఎం.బి. పరిమితి దాటి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ఆదేశాలను జారీ చేశారు. అన్ని శాఖల్లోనూ కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం అధికారులు కృషి చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories