కాకినాడలో అగ్నిప్రమాదం

కాకినాడలో అగ్నిప్రమాదం
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణం మెయిన్ రోడ్ లో ఉన్న సర్వాని సూపర్ మార్కెట్ లో విద్యుదాఘాతం...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణం మెయిన్ రోడ్ లో ఉన్న సర్వాని సూపర్ మార్కెట్ లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. భవనంలోని మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఇరుకు ప్రాంతం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకూ అందిన అంచనాల ప్రకారం ఆస్తి నష్టం సుమారు రెండు కొట్ల వరకూ ఉండొచ్చు. అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ భవనానికి చుట్టూ ఇరుకిరుకుగా భవనాలు ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి భవనం చుట్టూ తిరిగే అవకాశం లేదు. దీంతో భవనం ముందు వైపు నుంచే ఫైర్ ఇంజన్లు తో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా చూస్తున్నారు. మంటల తీవ్రత భారీగా ఉండటంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. సూపర్‌ మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తులు, స్కూల్‌ బ్యాగులు, దుస్తులు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories