Top
logo

సీఎం ఎవరైనా అభిమానిస్తాం: ఆర్. నారాయణమూర్తి

సీఎం ఎవరైనా అభిమానిస్తాం: ఆర్. నారాయణమూర్తి
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కానీ తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొద్దిరోజుల నుండి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగన్ ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదా అనే చర్చ జోరుగాసాగుతున్న నేపథ్యంలో నారాయణమూర్తిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ఏపీకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అభిమానిస్తామని చెప్పారు. చిత్ర పరిశ్రమ అనేది అద్దాలమేడలాంటిది.. ఎలా అర్థం చేసుకుంటున్నామనే దాని తీరుపైనే ఆధారపడి ఉంటుందని, సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, సీఎం ఎవరైనా వారిని అభిమానిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలా తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


లైవ్ టీవి


Share it
Top