విశాఖలోని పలు గ్రామాల్లో పంటచేలకు కోతుల బెడద..

విశాఖలోని పలు గ్రామాల్లో పంటచేలకు కోతుల బెడద..
x
Highlights

త్రేతాయుగంలో వానరులు రాముడికి ఎంత సహాయ పడ్డాయో తెలియదు గాని ఈ కలియుగములో మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. మహిళలను...

త్రేతాయుగంలో వానరులు రాముడికి ఎంత సహాయ పడ్డాయో తెలియదు గాని ఈ కలియుగములో మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖ జిల్లాలో పలు గ్రామాల్లో ప్రజలకు కోతులు నిద్రలేకుండా చేస్తున్నాయి. విశాఖలో పలు గ్రామాల ప్రజలను కొన్ని నెలలుగా కోతుల బెడద వేధిస్తోంది. ఒకటో, రెండో కాదు వందల్లో ఉన్న కోతుల గుంపు గ్రామ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. పంట పొలాలపై కోతులు సామూహిక దాడి చేస్తుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. పంటకు పట్టిన చీడపీడలకు మందో మాకో పెట్టి కాపాడుకుంటున్న రైతులు మర్కట మూకను నియంత్రించలేకపోతున్నారు. ప్రకృతి ప్రతికూలత నడుమ పంటల సాగు చేస్తున్న రైతులకు వానర బెడద పట్టుకుంది. గుంపులుగుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తూ నష్టపరుస్తున్నాయి. అడ్డుకోబోతే ఎగబడి కరుస్తున్నాయి.

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో పలు గ్రామాల్లో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వందలాది వానరాలు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. వడ్డాది, బంగారుమెట్ట, యల్‌ సింగవరం, పొట్టిదొరపాలెం, కోమాళ్లపూడి, చినప్పన్నపాలెం గ్రామాల్లో కోతులు బెదడ ఎక్కువయింది. పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల్లో మహిళలకు కూడా వానరాలు దడ పుట్టిస్తున్నాయి. రేషన్ డిపోకు వెళ్లాలన్నా, బజారుకు వెళ్లాలన్నా మహిళలు భయపడుతున్నారు. కోతుల చేష్టలతో ఇబ్బంది పడుతున్నారు.

కోతుల ఆగడాలను నుంచి రక్షించుకోడానికి గ్రామస్థులు వినూత్నంగా ఆలోచించారు. కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు పులి బొమ్మను పంట పొలాల్లోను, ఇళ్లపైనా ఉంచారు. కోతుల నుంచి రక్షించుకోడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. శనగ, చెరుకు, వరి, జామి, జీడిమామిడి తోటలకు నిరంతరం కాపు కాసినా ప్రయోజనం కనపడడం లేదని అందుకే పులిబొమ్మలను ఆశ్రయించామని రైతులు చెబుతున్నారు. గిట్టుబాట ధరలు లభించక ఒకవైపు ఆందోళన చెందుతున్న తమకు ...కోతుల చేష్టలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. కోతుల సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు గోడు వెల్లబుచ్చుకుచ్చుకున్నా ప్రయోజనం లేకపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories