Top
logo

ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ...

ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ...
Highlights

ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని...

ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని సహా.. రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీలో ఢిల్లీకి చెందిన స్కూల్ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. ప్రొఫెసర్‌ మహవీర్‌, అర్బన్ అండర్ రీజనల్ ప్లానర్.. డాక్టర్ అంజలీ మోహన్‌, అహ్మదాబాద్‌ సీఈపీటీ ప్రొఫెసర్‌ శివానంద స్వామి, ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు చెందిన ప్రొఫెసర్‌ కేటీ రవీంద్రన్‌, చెన్నైకి చెందిన రిటైర్డ్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌.. కేవీ అరుణాచలం ఉన్నారు. ఈ కమిటీకి కన్వినర్‌గా జీఎస్‌ రావును నియమిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


లైవ్ టీవి


Share it
Top