సామాన్యుడిలా తనిఖీలు.. చంద్రబాబు భద్రతపై టీడీపీ వర్గాలు ఆందోళన

సామాన్యుడిలా తనిఖీలు.. చంద్రబాబు భద్రతపై టీడీపీ వర్గాలు ఆందోళన
x
Highlights

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించడం. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. తమ అధినేతను అవమానించడమే...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించడం. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. తమ అధినేతను అవమానించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలోనే ఉన్నారని ఎద్దేవా చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్‌ కూడా ఇలాంటి చెకింగ్‌లను ఎదుర్కొన్నారని గుర్తు చేస్తోంది. అయితే ఎయిర్‌పోర్టుల్లో భద్రత కేంద్రప్రభుత్వం అంశం అని గుర్తు చేస్తోంది.

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును భద్రతా తనిఖీలు చేయడం రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేశాకే లోనికి అనుమతించారు. అంతేకాకుండా ఆయన వాహనాన్ని కూడా విమానాశ్రయంలోకి వచ్చేందుకు నిరాకరించారు. ఓ సామాన్య ప్రయాణీకుడి తరహాలోనే చంద్రబాబు విమానాశ్రయంలోనికి వెళ్లారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు సాధారణ ప్రయాణీకులు వెళ్లే వాహనంలోనే ప్రయాణించారు.

ఈ ఘటనపై టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబు భద్రత కూడా తగ్గించారని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక వాహనం కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని రాష్ట్ర పోలీసు శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి హోదాలో నియమించిన అదనపు భద్రతను మాత్రమే తగ్గించామని వివరించింది. ఎయిర్‌పోర్టులో భద్రతా అంశం కేంద్రం పరిధిలోనిదని స్పష్టం చేసింది. దీనిపై అధికారపార్టీ వైసీపీ కూడా కౌంటర్‌ ఎటాక్ చేస్తోంది. గతంలో చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేస్తోంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్‌ కూడా తనిఖీలను ఎదుర్కొన్నారని గుర్తుచేస్తున్నారు.

అయితే మాజీ ముఖ్యమంత్రులు, ఇతర వీఐపీలకు చెందిన సొంత వాహనాలను విమానాశ్రయం లోపలికి అనుమతి నిరాకరిస్తూ గతంలోనే కేంద్ర విమానాయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్లే విమానాశ్రయంలోకి చంద్రబాబు వాహనాన్ని అనుమతించలేదని చెబుతున్నారు. వీఐపీల భద్రత చూసే ఇంటెలిజెన్స్ సెక్యురిటి వింగ్ మాజీ ముఖ్యమంత్రులకు ఉండవని, జెడ్ ప్లస్ ప్రొటెక్టీగా చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత ఉంటుందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం సెక్యురిటి చెక్ మినహాయింపు పరిధిలోకి చంద్రబాబు రారని స్పష్టం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories