ఏపీలో ఈజిప్టు ఉల్లి..

ఏపీలో ఈజిప్టు ఉల్లి..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయల పంటలు దెబ్బతినడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపాయల పంటలు దెబ్బతినడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్నామ్నాయాన్ని ఆలోచించింది. ప్రజలకు సబ్సీడీ మీద ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలోనూ కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు అందుబాటులో ఉంచింది. వినియోగదారులకు ఇంత తక్కువ ధరకు ఉల్లిని అందించడానికి పక్క రాష్ట్రాల నుంచి తెప్పించినప్పటికీ సరిపోకపోవడంతో ఏకంగా పక్క దేశాల నుంచి కూడా తెప్పిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా ఈజిప్టు నుంచి కూడా ఉల్లిపాయలు దిగుమతి చేసింది.

ప్రతి జిల్లాకు తొలి విడతలో భాగంగా 27 టన్నుల ఈజిప్టు ఉల్లి పాయలను కేటాయించింది. ఈ ఉల్లి మంగళవారం విజయవాడలోని రైతు బజార్లలో 15 టన్నుల మేర విక్రయించారు. ఇక పోతే గుడివాడ, మచిలీపట్నం రైతు బజారుల్లో కూడా ఈజిప్టు ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారలు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత మేర ఉల్లి కష్టాలు తగ్గాయనే చెప్పుకోవాలి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories