రోగులకు చికిత్స చేస్తున్న స్వీపర్

రోగులకు చికిత్స చేస్తున్న స్వీపర్
x
Highlights

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు ఉంటారు కానీ వైద్యం మాత్రం స్వీపర్లే చేస్తున్నారు, ప్రమాదాల్లో గాయపడినా, జ్వరం వచ్చినా డాక్టర్లు స్పందించరు. స్వీపర్లు,...

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు ఉంటారు కానీ వైద్యం మాత్రం స్వీపర్లే చేస్తున్నారు, ప్రమాదాల్లో గాయపడినా, జ్వరం వచ్చినా డాక్టర్లు స్పందించరు. స్వీపర్లు, కింది స్థాయి సిబ్బందే ప్రాధమిక చికిత్స చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తీవ్రంగా గాయాలతో చికిత్స కోసం వచ్చిన ఓ పేషంట్ కు స్వీపరే వైద్యం చేసింది. అలాగే జ్వరంతో వచ్చిన వారికి సెలైన్ పెట్టడం ఇంజక్షన్ కూడా చేస్తుంది. వివిధ వైద్య సేవలకోసం వస్తున్న ఎందరో రోగులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చికిత్స చేయించుకుంటున్నారు. అయినా ఆసుపత్రి వైద్యులు కానీ వైద్యాధికారులు కాని పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు కనిపించరు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆసుపత్రి కింది స్థాయి సిబ్బందే వైద్యసేవలు చేస్తుంటారు. ఇదేంటని ప్రశ్నించినా సమాధానం చెప్పే వారు ఉండరు. తప్పని పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటున్నారు ఆసుపత్రికి వస్తున్న పేషంట్లు.

ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై పలుమార్లు హస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకు వెళ్లామంటున్నారు పలువురు. అయినా డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేషంట్లు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికే ప్రజలు భయపడుతున్నారు. ఎందరో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వైద్యాశాఖ ఉన్నతాధికారులు పూర్తి సమగ్ర విచారణ జరిపించి రోగులకు సరైన వైద్యం అందే విధంగా చూడాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories