అందుకే తెలంగాణతో కలిసి శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు: సీఎం జగన్‌

అందుకే తెలంగాణతో కలిసి శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు: సీఎం జగన్‌
x
Highlights

గోదావరి జలాల వినియోగంపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. తెలంగాణతో కలిసి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించడంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ...

గోదావరి జలాల వినియోగంపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. తెలంగాణతో కలిసి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించడంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ టీడీపీ సభ‌్యుడు లేవనెత్తిన ప్రశ్నపై సభలో వాడివేడి చర్చ నడిచింది. తెలుగుదేశం సభ్యుల ప్రశ్నలకు ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పగా, చివరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గోదావరి నాలుగు పాయల్లో కేవలం శబరి ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లొస్తున్నాయని, మిగతా మూడు పాయలూ తెలంగాణ దాటుకుని ఏపీలో రావాల్సి ఉందన్నారు. దాంతో గోదావరి జలాల్లో 12శాతం మాత్రమే ఆంధ్రాకి అందుబాటులోకి వస్తున్నాయని లెక్కలతో సహా వివరించారు. అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యతగా ఉంటేనే, ఆంధ్రా అవసరాలను తీర్చుకోగలుతామన్నారు. అందుకే తెలంగాణ సహకారంతో గోదావరి జలాలను శ్రీశైలం తరలించేందుకు ప్రతిపాదన చేశామన్నారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకోవడాన్ని హర్షించాల్సిందిపోయి దాన్ని కూడా వక్రీకరిస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీపై సీఎం జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories