కర్నూలు జిల్లాలో వజ్రాల వేట షురూ

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట షురూ
x
Highlights

రాయల సీమలో వరుణుడి కరుణతో రతనాలు బయటపడుతున్నాయి. దీంతో అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు పలువురు వజ్రాల వేట మొదలుపెట్టారు. తొలకరి జల్లులు పడటంతోనే...

రాయల సీమలో వరుణుడి కరుణతో రతనాలు బయటపడుతున్నాయి. దీంతో అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు పలువురు వజ్రాల వేట మొదలుపెట్టారు. తొలకరి జల్లులు పడటంతోనే కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో శనివారం నుంచే వజ్రాల వేట మొదలు కాగా, ఆదివారం జోరందుకుంది. ఇటీవల కురిసిన వర్షంతో ఎర్ర నేలల్లో వజ్రాన్వేషకులు వెతుకులాట ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో పిల్లల నుంచి ముసలివారి వరకు వజ్రాల వేట ప్రారంభించారు.

ఈ సీజన్ లో ఇప్పటికే ఆరు వజ్రాలు దొరికాయని ఇక్కడి వారు అంటున్నారు. ఈ వజ్రాల కోసం చాలా మంది తమ అదృష్ణాన్ని పరీక్షించుకుంటూ పంట పొలాల్లో వెతుకుతుంటారు. ఆర్థిక కష్టాల్లో ఉంటే పేదలు ఒక్క వజ్రం దొరికినా తమ సమస్యలు తీరిపోతాయని భావిస్తుంటారు. తొలకరి వర్షాలు పడే సమయానికి ఎంతో మంది ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తుంటారు. వీరితో పాటు వ్యాపారులు ఇక్కడ ప్రత్యక్ష మవుతారు. ఎవరికైనా వజ్రం దొరికిందంటే వీరు గుట్టుచప్పుడు కాకుండా కొనేసుకుంటారు. అధికారులకు, పోలీసులకు తెలిస్తే సమస్య అని వజ్రాలు దొరికిన చాలా మంది వాటిని వ్యాపారులకు ఎంతో కొంతకి అమ్మేస్తారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories