విచారణలో అన్ని విషయాలు తేలుతాయి: డీజీపీ

విచారణలో అన్ని విషయాలు తేలుతాయి: డీజీపీ
x
Highlights

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కెమికల్ కంపెనీలో ఓ ట్యాంక్ నుంచి విషవాయువు...

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కెమికల్ కంపెనీలో ఓ ట్యాంక్ నుంచి విషవాయువు లీకయినట్లు సమాచారం వచ్చిందని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మరో వైపు ఘటనపై హైకోర్టు స్పందించింది. సుమోటాగా విచారణకు స్వీకరించింది. గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది

విశాఖలో జరిగిన గ్యాస్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రమాదఘటన తీరును పరిశీలించారు. గ్యాస్ లీకేజ్‌ను కంట్రోల్ చేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించినా అది కాలేదని. ప్రమాదం ఎలా జరిగిందన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. ఆ తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీలోని ఓ ట్యాంక్ నుంచి విష వాయువు లీక్ అయినట్లుగా సమాచారం వచ్చిందని డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ విశాఖ చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్. అసలు ప్రమాదం ఎలా జరిగిందో విచారిస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగిందా..? సిబ్బంది తప్పిదం ఏమైనా ఉందా..? అనేది విచారణలో తెలుస్తుందన్నారు. కంపెనీలోని ఒక ట్యాంక్‌లో స్టైరిన్‌ చేస్తుండగా గ్యాస్‌ లీకేజీ ప్రమాదం చోటుచేసుకుందని.. అయితే గ్యాస్‌ లీకేజీ అయిన సమయంలో న్యూట్రలైజ్ కూడా పక్కనే ఉన్నప్పటికీ వాడకపోవడంపై పలు అనుమానాలున్నాయని డీజీపీ తెలిపారు. సాధారణ విచారణ తర్వాత కంపెనీపై కేసులు పెడతామని తెలిపారు.

మరో వైపు ప్రమాద ఘటనపై హైకోర్టు స్పందించింది. సుమోటాగా విచారణకు స్వీకరించింది. అత్యవసరంగా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది.

ఇటు గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై ప్రభుత్వం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. బాధితులకు ఎలాంటి వైద్య చికిత్స అందిస్తున్నారు. పునరావాసాలు కల్పించారా లేదా అన్న విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్‌ను కమిషన్, డీజీపీని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories