Andhra Pradesh : కల్యాణంలో కరోనా భయం ... మాస్కులు ధరించి పెళ్లి చేసున్న జంట

Andhra Pradesh :  కల్యాణంలో కరోనా భయం ... మాస్కులు ధరించి పెళ్లి చేసున్న జంట
x
Covid Featr In Marriage
Highlights

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారీ నుంచి తీసుకోని జాగ్రత్తలంటూ లేవు తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహ వేదిక కరోనా వైరస్ అవగాహనకు...

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారీ నుంచి తీసుకోని జాగ్రత్తలంటూ లేవు తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వివాహ వేదిక కరోనా వైరస్ అవగాహనకు వేదికయ్యింది. వధూవరులు పెళ్లి పీటలపైకి వచ్చింది మొదలు పెళ్లి తంతు ముగిసేవరకూ నోటికి మాస్క్ లు ధరించి ఉన్నారు. అంతే కాదు వివాహ వేడుకకు వచ్చిన బంధుమిత్రులతో పాటు పెళ్లి జరిపించిన పురోహితుడు సైతం నోటికి మాస్క్ ధరించే పెళ్లి తంతు ముగించారు.

పెళ్లంటే నూరేళ్ల పంట బంధు మిత్రులు, భాజాభజంత్రిలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక పెళ్లికి వచ్చే వారంతా వంటి నిండా నగలు ధరిస్తుంటారు తాజాగా కరోనా దెబ్బతో జనం అల్లాడుతుంటే ప్రజలకు అవగాహన కల్గించే విధంగా వింతగా నోటికి మాస్క్ లు ధరించి నూతన వధువరులు వివాహ వేడుక జరుపుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కూనా శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన వివాహ వేడుకను కరోనా వైరస్ పట్ల అవగాహాన కల్గించే విధంగా జరిపించారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులతో పాటు నూతన వధువరులు నోటికి మాస్కులు ధరించారు. అంతే కాదు వివాహం జరిపించిన పురోహితుడు సైతం నోటికి మాస్కు వేసుకునే వేదమంత్రోత్సవాల మధ్య పెళ్లితంతు జరిపించారు.

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్గించే విధంగా ప్రభుత్వం, సోషల్ మీడియా ప్రచారం చేస్తుండగా తమ వంతు చైతన్యం కల్గించేందుకు ఇలా వినూత్నంగా పెళ్లి నిర్వహించామని పెళ్లికొడుకు బంధువులు చెబుతున్నారు. నోటికి మాస్కులు ధరించి పెళ్లికి రావడం కాస్త వింతగా ఉన్నా ప్రజలకు అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు నూతన వధువరులను ఆశీర్వదించేందుకు వచ్చిన పలువురు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories