వాట్సప్ లో కరోనా హెల్ప్ లైన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

వాట్సప్ లో కరోనా హెల్ప్ లైన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

కొవిడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌లో +91 82971 04104 నంబరును అందుబాటులోకి తీసుకు...

కొవిడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌లో +91 82971 04104 నంబరును అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని సేవలను ప్రతి ఒక్కరూ ఉచితంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండగా, మహమ్మారిగా మారిన కొవిడ్-19 గురించి కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని తాజాగా తెలుసుకునేందుకు ఇది సహకరించనుంది.

వాట్సాప్‌లో ఈ ఉచిత 'Andhra Pradesh Gov Covid Info' హెల్ప్‌లైన్ సేవలను ఉచితంగా వినియోగించుకునేందుకు, మీ ఫోన్ కాంటాక్ట్‌లలో +91 82971 04104 నంబర్‌ను సేవ్ చేసుకుని, అనంతరం వాట్సాప్ సందేశంలో 'Hi' అనే పదాన్ని టైప్ చేసి పంపించండి. ఈ సేవలు తెలుగు మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి.

'Andhra Pradesh Gov Covid Info' హెల్ప్‌లైన్ అనేది ఆటోమేటిక్ 'చాట్‌బాట్' సేవ కాగా, కరోనావైరస్ గురించి ప్రశ్నలకు ధృవీకరించబడిన సమాధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 24 గంటల్లో పౌరులు పొందేందుకు అనుమతిస్తుంది. ప్రారంభంలో ఈ హెల్ప్‌లైన్ ద్వారా కరోనా వైరస్ నియంత్రణ మరియు లక్షణాలు, కొవిడ్-19 తాజా స్థితిగతులు, లాక్‌డౌన్, ఆరోగ్య సదుపాయాలు మరియు ఐసోలేషన్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం, భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న కేంద్రాలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు వినియోగదారులు విరాళాలను అందించే విధానం, తదితరాలను ప్రస్తుతానికి తెలుసుకునేందుకు అవకాశం ఉండగా, భవిష్యత్తులో మరిన్ని ఎంపికలను ఇందులో చేర్చనున్నారు.

వాట్సాప్‌తో భాగస్వామ్యం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌లో (tweeted,) "మహమ్మారి గురించి కచ్చితమైన సమాచారాన్ని ప్రజలు అందుకునేందుకు అనుగుణంగా కరోనా వైరస్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌ & ఫేస్‌బుక్‌లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుని హెల్ప్ డెస్కుల ద్వారా కొవిడ్-19 గురించి ప్రజలకు తాజా సమాచారం & అప్‌డేట్లను వేగంగా అందిస్తున్నాము. ఇటువంటి కీలక సమయంలో తక్షణ అవసరానికి ఛాట్‌బోట్‌ను నిర్మించిన ఫేస్‌బుక్ & ఇతర సంస్థల ప్రతినిధులు, బృందాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని'' పేర్కొన్నారు.

''విశ్వసనీయమైన సమాచార వనరులకు మూలం అనేది కరోనా వైరస్‌తో పోరాటం చేసేందుకు చాలా ముఖ్యమైనది మరియు ఇదే మాకు ప్రముఖ ప్రధాన్యతగా ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఈ అవకాశం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ఏదైనా సమాచారం కోసం ధృవీకరించబడిన వనరులపై ఆధారపడాలని మేము వినియోగదారులకు సిఫార్సు చేస్తున్నామని" భారత దేశంలో వాట్సాప్ సంస్థ అధికారి అభిజిత్ బోస్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories