కరోనా కోరల్లో సిక్కోలు.. రోజురోజుకు పెరుగుతున్న ఉధృతి

కరోనా కోరల్లో సిక్కోలు.. రోజురోజుకు పెరుగుతున్న ఉధృతి
x
Highlights

శ్రీకాకుళంలో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి జిల్లావాసులను కలవరపెడుతోంది. వైరస్ ఆలస్యంగా జిల్లాలోకి ప్రవేశించినప్పటికీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది....

శ్రీకాకుళంలో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి జిల్లావాసులను కలవరపెడుతోంది. వైరస్ ఆలస్యంగా జిల్లాలోకి ప్రవేశించినప్పటికీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. చేసేదేమి లేక జిల్లాలోని కొన్ని ప్రాంతాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

జిల్లాలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పలాస, మందస, బూర్జ, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా కరోనా సోకడంతో వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే అలాంటిదేమి లేదని అంటున్నారు అధికారులు.

ఇప్పటివరకు జిల్లాలో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా అందులో 193మంది కోలుకున్నారు. ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ నివారణ చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. వైరస్ కట్టడికి ప్రైవేట్ ఆసుపత్రులతో సహా అన్ని వర్గాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వేలను చేపట్టనున్నారు. మరోవైపు కరోనా ఉధృతితో భయాందోళనలకు గురవుతోన్నా వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. అటు ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపడుతోన్నా రక్కసిలా విరుచుకుపడుతోన్న కరోనా భయం సిక్కోలు వాసులను వెంటాడుతూనే ఉంది. మహమ్మారి ధాటికి స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ జిల్లావాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories