మామిడిపళ్ల రవాణాపై లాక్‌డౌన్ ఎఫెక్ట్

మామిడిపళ్ల రవాణాపై లాక్‌డౌన్ ఎఫెక్ట్
x
Highlights

ప్రపంచాన్నే కుదిపేసిన కరోనా మహమ్మారి.... మధుర ఫలాలపై కూడా తన ప్రభావాన్ని చూపింది.

ప్రపంచాన్నే కుదిపేసిన కరోనా మహమ్మారి.... మధుర ఫలాలపై కూడా తన ప్రభావాన్ని చూపింది. మామిడి పండ్లకే రా రాజు గా పేరున్న కర్నూలు జిల్లా బంగినపల్లి మామిడికి కరోనా, లాక్‌డౌన్‌ కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. ఊహించని అకాల వర్షం, గాలి, వాన మామిడి పంటను నమ్ముకున్న రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది.

వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ మామిడిపండు అంటే ఎనలేని మక్కువ చూపిస్తారు. అందులో బంగినపల్లి బెనీషాకు ఉన్న క్రేజే వేరు. భారతదేశ ప్రజలకు బనగానపల్లి నవాబ్ పరిచయం చేసిన ఈ పండు రుచి చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపిస్తుంటారు. మామిడి మొక్కలకు అంటుకట్టి పేరు పెట్టకుండా వదిలేసిన చెట్టు పండే బెనిషా. అంటే పేరు లేనిది అని అర్థం.

మిగిలిన ప్రాంతాల్లో కంటే ఈ బంగిన పండ్ల ధర అధికంగా ఉంటుంది. రుచిలో కూడా మిగతా మామిడి పండ్ల కంటే భిన్నంగా అతి మధురంగా ఉంటుంది. దీంతో ఈ పండ్లను ఎక్కువగా అధికారులకు అమాత్యులకు అయినవారికి ఖర్చు కాస్త ఎక్కువైనా కొనుగోలు చేసి... మరీ పంపిస్తుంటారు.

అయితే ఈసారి బంగినపల్లి మామిడి కాపును కరోనా కాటేసింది. సరైన రవాణా సౌకర్యం లేక కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తోటలోనే పండ్లు కుల్లి పోవటంతో పాటు...గాలి వానతో నేలరాలాయి. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి కరోనా పుణ్యమా అంటూ నేలపాలు కావడంతో మామిడి రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు

ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపు ఇవ్వడంతో మామిడి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. అయితే మామిడి పండ్ల మార్కెట్ పుంజుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దిగుబడి అంతంతమాత్రంగా ఉండటంతో మామిడి పండ్లు ధరలు అమాంతం పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గడంతోపాటు మార్కెట్ లేకపోవడంతో మామిడి రైతులు నష్టాలను చవి చూడనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories