రోబోతో కరోనా రోగులకు సేవలు.. ప్రవేశపెట్టిన ఏపీ అధికారులు

రోబోతో కరోనా రోగులకు సేవలు.. ప్రవేశపెట్టిన ఏపీ అధికారులు
x
Highlights

ఏపీలో తొలిసారిగా కరోనా రోగులకు సేవలు అందించేందుకు అధికారులు రోబోను వినియోగిస్తున్నారు. ఈ రోబోను నెల్లూరు జిల్లాలో అధికారులు ప్రవేశపెట్టారు....

ఏపీలో తొలిసారిగా కరోనా రోగులకు సేవలు అందించేందుకు అధికారులు రోబోను వినియోగిస్తున్నారు. ఈ రోబోను నెల్లూరు జిల్లాలో అధికారులు ప్రవేశపెట్టారు. నెల్లూరు లోన్ రీజనల్ కోవిడ్ సెంటర్ (జిజిహెచ్) లో ఈ రోబో సేవలు అందించనుంది. నెల్లూరుకు చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను జిల్లా అధికారులకు అందించి దీని పనితీరుపై ఆ సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్‌ డెమో ఇచ్చారు. దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా పాజిటివ్ రోగుల వద్దకు చేర్చే విధంగా రోబోను తయారు చేసినట్లు హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు తెలిపారు.

కాగా.. మరో రెండు రోబోలను అందుబాటులోకి తెస్తామని హెల్పింగ్ హాండ్స్ సంస్థ నిర్వాహకులు నిజాముద్దీన్ చెప్పారు. రోబో పనితీరును డేమో ద్వారా అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ప్రత్యేక ఐఏఎస్ అధికారి రాం గోపాల్,కలెక్టర్ శేషగిరి బాబు, జేసి డాక్టర్ వినోద్ ఉన్నారు. హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులను అధికారులు అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories