విశా‌ఖలో కలవరపెడుతోన్న కరోనా వైరస్

విశా‌ఖలో కలవరపెడుతోన్న కరోనా వైరస్
x
విశా‌ఖలో కలవరపెడుతోన్న కరోనా వైరస్
Highlights

విశాఖ టూరిజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బుక్ చేసుకున్న ప్రయాణికులు భయపడి క్యాన్సిల్ చేసుకుంటుండటంతో ట్రావెల్ ఏజెన్సీల వ్యాపారం ఒక్కసారిగా...

విశాఖ టూరిజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బుక్ చేసుకున్న ప్రయాణికులు భయపడి క్యాన్సిల్ చేసుకుంటుండటంతో ట్రావెల్ ఏజెన్సీల వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. తెలుగురాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటక ప్రియులు సాగర అందాలను తిలకించేందుకు భయపడుతున్నారు. దీంతో సుందరమైన సందర్శనీయ స్ధలాలు కరోనా వైరస్ భయంతో కళతప్పుతున్నాయి.

కారోనా వైరస్ టూరిజానికి షాక్ ఇచ్చింది. టూరిస్టుల సంఖ‌య గణనీయంగా తగ్గడంతో, ట్రావెల్స్ ఏజెన్సీ వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. దుబాయ్, మలేషియా, కౌలాలంపూర్‌, సింగపూర్ నుంచి నగరానికి రాకపోకలు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో విదేశీయులతో పాటు దేశీయ ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయింది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే సాగరతీరానికి ఒక్క నెలలో 70 శాతం పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ట్రావెల్స్‌, హోటల్స్‌, ఇతర అతిధ్య రంగాలకు చెందిన వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వైరస్ గురించి ముందే తెలియడంతో తమ పర్యటనలకు మార్చుకుంటున్నామని టూరిస్టులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణీకులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎయిర్‌పోర్టు, విశాఖ, గంగవరం పోర్టుల్లో స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీబీ, కేజీహెచ్, పోర్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా కరోనా వార్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,068 మందికి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చిన 28 మందిపై 14 రోజులుగా నిఘా పెట్టారు. కాగా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories