కరోనా ఎఫెక్ట్ : శ్రీశైలం మల్లన్నకు పెరిగిన ఆన్ లైన్ ఆదాయం

కరోనా ఎఫెక్ట్ : శ్రీశైలం మల్లన్నకు పెరిగిన ఆన్ లైన్ ఆదాయం
x
Highlights

కరోనా పుణ్యమా అంటూ ఆలయాలు మూతపడినా.... ఆదాయం లో మాత్రం ముందు వరుసలో కొనసాగుతున్నాయి.

కరోనా పుణ్యమా అంటూ ఆలయాలు మూతపడినా.. ఆదాయం లో మాత్రం ముందు వరుసలో కొనసాగుతున్నాయి.. దక్షిణ కాశిగా వెలుగొందుతున్న జ్యోతిర్లింగం, శక్తి పీఠం కలగలిసిన మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం... ఆన్లైన్ లో రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది... ఒకపక్క లాక్ డౌన్ కొనసాగుతున్నా.. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వీలు లేకపోయినా.. భక్తులు దేవస్థానం అందిస్తున్న ఆన్లైన్ సేవలతో తృప్తి చెందుతూ ఆలయ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు.... దీనికి సంబంధించి ఒక సారి పూర్తి వివరాల్లోకి వెళితే

కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. దీంతో సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేక ప్రముఖ దేవాలయాలు సతమతం అవుతున్నాయి. శ్రీశైల దేవస్థానం సిబ్బంది జీత భత్యాలు, ఆలయ నిర్వహణ ఖర్చులకు గాను నెలకు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లన్నను ఆన్ లైన్ లో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.

మల్లన్న ఆన్ లైన్ దర్శనం గత ఏప్రిల్ 13వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వివిధ పూజ సేవలను భక్తులను అందిస్తున్నారు. వెయ్యినూట పదహారు రూపాయలతో ఏ పూజ చేసేందుకైనా అవకాశం కల్పించారు. యూట్యూబ్ ద్వారా, శ్రీశైల దేవస్థానం ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా వీక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వామివారి దూరదర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ఆలయంకంటే శ్రీశైలం దేవస్థానానికి 60,41,342 రూపాయల రాబడి వచ్చింది. ఇప్పటివరకు 4,800 టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు కొనుగోలు చేసి పూజలను చేసుకున్నారు.

మహా మృత్యుంజయ హోమానికి ఇప్పటివరకు అత్యధికంగా 1337 మంది ఈ సేవను వినియోగించుకోగా... మిగతా సేవలను కూడా భక్తులు వినియోగించుకొని పూజలు నిర్వహించకున్నారు. కర్ణాటక తెలంగాణ లోనే కాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల నుంచి కూడా ఈ పూజలను ఆన్లైన్ ద్వారా స్వామి వారి పూజలను వీక్షిస్తూ, ఈ పూజల సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ వద్ద శ్రీశైలం ఆన్లైన్ సర్వీసులకు ఆరు లక్షల 65 వేల 221 మంది వీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో విరాళాలు ఇచ్చిన దాతలకు ఆన్ లైన్ ద్వారా మల్లన్న స్వామి ఆశీర్వచనం కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ఆన్లైన్లో పూజల లో భాగంగా మహా మృత్యుంజయ హోమము, చండీ హోమము, రుద్రాభిషేకము, స్వామి అమ్మవారి కళ్యాణం, సుబ్రమణ్యస్వామి కల్యాణం, గణపతి హోమం, కుంకుమార్చనలను భక్తులు పూజలను ఆన్లైన్ ద్వారా నిర్వహించుకుంటున్నారు... వీటిలో మహా మృత్యుంజయ హోమానికి ఇప్పటివరకు అత్యధికంగా 1337 మంది ఈ సేవను వినియోగించుకోగా... మిగతా సేవలను కూడా భక్తులు వినియోగించుకొని పూజలు నిర్వహించకున్నారు. కర్ణాటక తెలంగాణ లోనే కాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల నుంచి కూడా ఈ పూజలను ఆన్లైన్ ద్వారా స్వామి వారి పూజలను వీక్షిస్తూ, ఈ పూజల సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ వద్ద శ్రీశైలం ఆన్లైన్ సర్వీసులకు ఆరు లక్షల 65 వేల 221 మంది వీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అనునిత్యం అన్ లైన్ సేవల కార్యక్రమాలను వీక్షించేందుకు అర్చకులు వేదపండితులు శ్రీశైలం టీవీ వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు... ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ సంబంధించిన అధికారులు కూడా శ్రీశైల దేవస్థానం అన్ లైన్ సేవలను అభినందిస్తున్నారని, త్వరలో విరాళాలు ఇచ్చిన దాతల కు ఆశీర్వచనం కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.. శ్రీశైలం ఆన్లైన్ సేవలకుగాను కాల్ సెంటర్ నెంబర్ ని తెలిపామని ఇందుకుగాను 8333901351,1352,1353,1354,1355,1356 నంబర్లకు కాల్ చేసి ఈ దూర సేవలను భక్తులు వినియోగించుకోగలరని కోరారు ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories