వారి దరువు మూగబోయింది

వారి దరువు మూగబోయింది
x
Highlights

జనాలను చైతన్య పరిచిన వారి దరువు మూగబోయింది. డప్ప, గజ్జల సప్పుల స్వరూపమే మారిపోయింది. నయా టెక్నాలజీకి తట్టుకోలేక ఉపాధిని కోల్పోతున్న వారిని మహమ్మారి...

జనాలను చైతన్య పరిచిన వారి దరువు మూగబోయింది. డప్ప, గజ్జల సప్పుల స్వరూపమే మారిపోయింది. నయా టెక్నాలజీకి తట్టుకోలేక ఉపాధిని కోల్పోతున్న వారిని మహమ్మారి రోగం వారి పొట్టకొడుతోంది. ఏళ్ల తరబడి అదే వృత్తిని జీవనాధారమైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనాతో కళతప్పిన కళాకారులపై హెచ్‍ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

పల్లె ప్రజల జీవన పరిమళాన్ని జానపద కళలు చవిచూపిస్తాయి. తాళం, లయ, వాద్యం, నృత్యం, అభినయం, ఆహార్యం, లయబద్ధమైన కదలికలతో కూడిన వీరి ఆటలు, పాటలతో జానాల్లో చైతన్యం, ఆనందాన్ని పంచుతారు. తమ ప్రదర్శనలతో అందరినీ మైమరపింపజేశారు. అందరికీ ఆనందాన్ని పంచే కళాకారుల జీవితాల్లో మాత్రం ఆనందం లేకుండా పోతోంది. అసలే ప్రజల ఆదరణ కరువైన వీరి జీవితాల్లోకి కరోనా ఎంట్రీతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్లో చైతన్యం నింపడంతో కీలకంగా మారిన జానపద కళాకారులకు ఉపాధి కరువై నానాపాట్లు పడుతున్నారు.

పల్లెల్లో ఒకప్పుడు జానపద కళాకారులు నృత్యాలు, నాటికలు, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపి ఒక వెలుగు వెలిగారు. కళంటే బతుకునిచ్చేది కాదు బతుకునేర్పేదని కళాకారులను చూస్తుంటే అర్థమవుతోంది. సంపద కరిగిపోయినా తమ తాత, ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయ కళను మరిచిపోకుండా కళనే నమ్ముకొని నేటికి జీవనం సాగిస్తున్నారు. జానపద కళలైన చిందు, యాక్షగానం, ఒగ్గు డోలు, బుర్ర కథ, పిట్టల దొరలు, సౌరాణికాలు తదితర కళలతో కళనే జీవనాధారంగా చేసుకొని చాలా కుటుంబాలు బతికేవి.అయితే 70 రోజుల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు తిండిలేక నానా అవస్థలు పడుతున్నాయి.

తరతరాలుగా వారసత్వంగా తీసుకుని ఒకప్పుడే ఎంతో ప్రాచుర్యం పొందిన జానపద కళాకారులు ఇప్పుడు అన్నమో రామచంద్ర అంటూ కలవరిస్తున్నారు. వివిధ వేషధారణతో ప్రజలకు ఆకట్టుకున్న వారు ఆదరణ కరువై ఉపాధి కూడా దొరకక అవస్థలు పడుతున్న తమకు కరోనా శాపంగా మారిదంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కరోనాపై కూడా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు కళాకారులు. ఆటపాట రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. పొట్టకూటి కోసం ఇబ్బందులు పడుతున్న తమను సర్కారే ఆదుకోవాలని ధీనంగా వేడుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories