అందాల అరకుకు కరోనా ఎఫెక్ట్‌

అందాల అరకుకు కరోనా ఎఫెక్ట్‌
x
Borra Caves (File Photo)
Highlights

భాగ్యనగరంలో రంజాన్‌ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. రంజాన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో చార్మినార్ పరిసరాలు సందడిగా మారతాయి.

ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన విశాఖ మన్యంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన మన్యానికి లాక్‌పడింది. దీంతో అమాయక గిరిజనం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ఎఫెక్ట్‌తో మదిని దోచే సహజసిద్ద అందాలను చూసేందుకు పర్యాటకులు రాకపోవడంతో బోసిపోయి కనిపిస్తున్నాయి. టారిజంతో పాటు గిరిజనుల మనుగడే ప్రశ్నార్థంగా మారింది.

కొండలపైన పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉన్న విశాఖ మన్యం ప్రాంతాలు నిర్మానుష్యంగా సందర్శకులు లేక కనిపిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఇక్కడ ఎప్పుడూ పర్యాటకుల సందడి నెలకొనేంది. హాలిడేస్‌ వస్తే చాలు చల్లని ప్రదేశం సేదతీరేందుకు క్యూ కట్టేవారు. ప్రస్తుతం కరోనా పంజా విసురుతుండటంతో ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అయిన అరకుకు లాక్‌పడింది. దీంతో సందర్శకుల తాకిడి లేక టూరిస్ట్‌ స్పాట్లు బోసిపోసి కనిపిస్తున్నాయి. వాటిపైనే ఆదారపడ్డ ఎంతో మంది గిరిజనులకు ఉపాధి కరువైంది.

లాక్‌డౌన్‌ కారణంగా నెలలుగా టూరిస్టు ప్రాంతాలకు లాక్‌ పడింది. దీంతో పర్యాటకంగా ఆదాయం తగ్గిపోయింది. దీంతో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గిరిజనులు సైతం ఉపాధిని కోల్పోయి ఆవేదన చెందుతున్నారు. అటవీ ఉత్పత్తులు కొనేవారు లేక. చేసేందుకు పనులు లేక బతకడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. కరోనా తమ జీవితాలనే మార్చేసిందని... దీంతో అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నామని కన్నీరుపెట్టుకుంటున్నారు.

లాక్‌డౌన్‌తో హోటల్స్‌, రిసార్ట్స్‌, మెస్‌లు లాడ్జ్‌లు మూతపడటంతో ఎలా బతకాలో కూడా తెలియడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వ సాయం కూడా తమకు అందడం లేదంటున్నారు. తమ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చిరువ్యాపారులు వాపోతున్నారు. మొత్తానికి లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి, గిరిజనుల ఉపాధికి గండిపడింది. మహమ్మారి పర్యాటకంపై పెనుప్రభావం చూపుతోంది. ఇదంతా మళ్లీ గాడిలో పడాలంటే మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories