Top
logo

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ముగ్గురు అభ్యర్ధుల పేర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ముగ్గురు అభ్యర్ధుల పేర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వారిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అభ్యర్ధులుగా ప్రకటించారు. నేటి సాయంత్రం వరకు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. సంఖ్యాబలం రీత్యా ఆ మూడూ అధికార పార్టీ వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it