మళ్లీ ప్రజల మధ్యకు వైఎస్‌ జగన్‌

మళ్లీ ప్రజల మధ్యకు వైఎస్‌ జగన్‌
x
Highlights

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ నుంచి జిల్లాల్లో పర్యటిస్తానన్న...

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ నుంచి జిల్లాల్లో పర్యటిస్తానన్న వైఎస్ జగన్‌ ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన జగన్మోహన్‌‌రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

సుదీర్ఘ పాదయాత్రతో ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి మూడు నెలల పాలన తర్వాత మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించారు. అమెరికా టూర్‌ తర్వాత, సెప్టెంబర్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. స్పందన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన సీఎం జగన్‌ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని తెలియజేశారు.

ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్న జగన్మోహన్‌‌రెడ్డి అక్టోబర్‌ 15న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించినట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతు భరోసాలో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక ఇసుక కొరతపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్న జగన్‌ 200 రీచ్‌ల నుంచి శాండ్ సప్లై చేయాలని సూచించారు. అలాగే వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అంతా సిద్ధంచేయాలని ఆదేశించారు.

40రోజుల వ్యవధిలో రెండున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్ల నిమాయకం కంప్లీట్‌ చేయడం ఒక రికార్డన్న సీఎం జగన్‌ లక్షా 34వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 22లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆయా పరీక్షలను సమర్ధంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పంద్రాగస్ట్‌ రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభిస్తామన్న జగన్మోహన్‌రెడ్డి సెప్టెంబర్ ఫస్ట్‌ నుంచి పని ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీతోపాటు వివిధ పథకాలకు అర్హులైన కౌలురైతులు, మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులను గుర్తిస్తారని, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్దిదారులను కూడా ఐటెండిఫై చేస్తారని అన్నారు.

ఇక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రానికి కృష్ణాజలాలు వస్తున్నాయన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కృష్ణా పరివాహక రిజర్వాయర్లన్నీ పూర్తిగా నింపాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు కలెక్టర్లకు ఆదేశించారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక, ఫస్ట్‌ టైమ్‌ ఎక్కువ సమయం సచివాలయంలోనే గడిపారు వైఎస్ జగన్‌. మధ్యాహ్నం తర్వాత క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిపోయే జగన్మోహన్‌‌రెడ్డి లంచ్ సైతం సెక్రటేరియట్‌లోనే చేసి, వరుస సమీక్షలతో బిజీబిజీగా గడిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories