నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్

నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్
x
Highlights

ప్రకాశం జిల్లా రైతాంగం కల్పతరువు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఏపీ సీఎం జగన్ వస్తున్నారు. కరువు జిల్లా దాహం తీర్చేందుకు అప్పటి సీఎం వైఎస్ చేసిన...

ప్రకాశం జిల్లా రైతాంగం కల్పతరువు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఏపీ సీఎం జగన్ వస్తున్నారు. కరువు జిల్లా దాహం తీర్చేందుకు అప్పటి సీఎం వైఎస్ చేసిన ప్రయత్నానికి ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న జగన్ అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించడంతో పాటు యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు. దీంతో ఇన్నాళ్లకైనా ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆశ జిల్లా రైతాంగంలో నెలకొంది.

కరువు జిల్లాగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మితమవుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం జగన్ ఇవాళ రానున్నారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకు చేరుకోనున్న జగన్ ముందుగా టన్నెల్ 2 లోని పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత 11 గంటల సమయంలో టన్నెల్ వన్ పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత 11 గంటలా 30 నిమిషాలకు ప్రాజెక్టు పనుల పై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు.

ప్రకాశం జిల్లా దాహం తీర్చే వెలిగొండ ప్రాజెక్టు కల ఇప్పటిది కాదు. కరువుతో అల్లాడిన జిల్లాను ఆదుకునే లక్ష్యంలో 2004 లో అప్పటి సీఎం వైఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నల్లమల కొండల్లో బారీ రిజర్వాయర్ ను డిజైన్ చేసి శ్రీశైలం నీటితో నింపే విదంగా ప్లాన్ చేశారు. 5 వేల 492 కోట్ల నిదులను కూడా కేటాయించారు. ఆనాటి నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన టీడీపీ పాలనలో కూడా పనులను వేగవంతం చేశారు. అయితే నిధుల సేకరణతో పాటు సాంకేతిక సమస్యలతో పనుల వేగం తగ్గినట్లు చెబుతారు.

అయితే తాజాగా అదికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రెండు దశల్లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే 3 వేల 480 కోట్లు నిదులు అవసరమని అంచనా వేసింది. తొలి విడతగా 16 వందల కోట్ల నిదులు విడుదల చేయాల్సిందిగా జగన్‌ ఆర్దిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి టన్నల్ 18 కిలో మీటర్లకు గాను మిగిలిపోయిన 1.34 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి జూన్ నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి 85 వేల క్యూసెక్కుల నీటిని నీళ్లు తెచ్చేలా ఆదేశాలిచ్చారు. అలాగే రెండో విడత పనుల కోసం 18 వందల 80 కోట్లు నిధులు కూడా కేటాయించారు. ఇవి 2021 నాటికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారు.

మొత్తం రెండు విడతల్లో ప్రాజెకును పూర్తి చేసి 2021 లోపు రైతులకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా 64 కోట్లు ఆదా చేసిన ముఖ్యమంత్రి జగన్ అదే ఊపుతో ప్రాజక్ట్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక 11 ముంపు గ్రామాల ప్రజలకు పోలవరం తరహాలోనే పునరావాస ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్త 4 లక్షల 47 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్న వెలిగొండ ప్రాజెక్టు 15 లక్షల మంది దాహార్తిని కూడా తీర్చబోతోంది. ప్రకాశం జిల్లా తోపాటు కడప, నెల్లూరు జిల్లాకు వెలిగొండ ప్రాజక్టు నీళ్లు అందనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories