Polavaram Project: కాసేపట్లో పోలవరానికి ఏపీ సీఎం

Polavaram Project: కాసేపట్లో పోలవరానికి ఏపీ సీఎం
x
కాసేపట్లో పోలవరానికి ఏపీ సీఎం
Highlights

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈరోజు పోలవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌లో పోలవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌, గంటన్నరపాటు...

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈరోజు పోలవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌లో పోలవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌, గంటన్నరపాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. 2021 చివరి నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పనుల వేగవంతానికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. 2021 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న ప్రభుత్వం, పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

ఉదయం 11గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌లో పోలవరం చేరుకోనున్న సీఎం జగన్‌, దాదాపు గంటన్నరపాటు పనులను పరిశీలించనున్నారు. స్పిల్‌వే 18వ గేటు దగ్గర ఏర్పాటు చేసిన పోలవరం పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం, హిల్‌ వ్యూ-2పైకి వెళ్లి స్పిల్‌వే కాంక్రీట్ పనులను పరిశీలిస్తారు. అలాగే, గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఎగువ కాఫర్ డ్యామ్‌ను చూస్తారు. అక్కడ్నుంచి పోలవరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంకానున్నారు. పనులు జరుగుతున్న తీరు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్నతస్థాయి సమీక్షిస్తారు. ముఖ్యంగా పరిహారం, పనుల వేగవంతంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ సమావేశంలోనే నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories