Top
logo

ఫిబ్రవరి 28న సీఎం జగన్‌ పోలవరం టూర్

ఫిబ్రవరి 28న సీఎం జగన్‌ పోలవరం టూర్ఫిబ్రవరి 28న సీఎం జగన్‌ పోలవరం టూర్
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 28న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 28న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. సీఎం జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, పునరావాస, పరిహార ప్యాకేజీ అధికారులతో మంగళవారం రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, పునరావాస ప్యాకేజీ సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. 2021 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకోవడంతో, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

Web TitleCM Jagan to Visit Polavaram Project on feb 28
Next Story


లైవ్ టీవి