పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్‌

పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్‌
x
Highlights

గోదావరి మరోసారి గర్జించింది. నదీ అందాలను వీక్షించాలనుకున్న ప్రయాణీకులను మరోసారి అమాంతం మింగేసింది. పాపికొండల దృశ్యాలను మదిలో చిరస్మరణీయంగా...

గోదావరి మరోసారి గర్జించింది. నదీ అందాలను వీక్షించాలనుకున్న ప్రయాణీకులను మరోసారి అమాంతం మింగేసింది. పాపికొండల దృశ్యాలను మదిలో చిరస్మరణీయంగా దాచుకునేందుకు బోటులో బయల్దేరిన ప్రయాణీకులను తిరిగిరాని గమ్యాలకు చేర్చింది.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. కచ్చులూరు సమీపంలో ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 60 మంది ప్రయాణీకులున్నారు. వీరిలో 10 మంది మాత్రమే ఒడ్డుకు చేర్చుకున్నారు. ఒడ్డుకు చేరుకున్న వారిలో కొందరికి లైఫ్ జాకెట్లున్నట్లు తెలుస్తోంది. దీంతో గల్లంతైన 50 మంది ప్రయాణీకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో బోట్లకు ఎలాంటి అనుమతులివ్వలేదు. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గడంతో పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. దీంతో పాపికొండలకు వెళ్తున్న సమయంలో బోటు కచ్చులూరు దగ్గర బోల్తా పడింది.

గండిపోచమ్మ నుంచి పాపికొండలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. ఇటు బోటు ప్రమాదంపై సీఎం జగన్‌ స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటు ఘటనాస్థలికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. అంతేకాకుండా సహాయకచర్యల కోసం రెండు NDRF బృందాలు కూడా బయల్దేరి వెళ్లాయి. కాసేపట్లో అవి అక్కడికి చేరుకోనున్నాయి. ఒక్కో బృందంలో 30 మంది ఉంటారని అధికారులు వెల్లడించారు.

అయితే ప్రమాదానికి గురైన బోటు.. రాయల్‌ వశిష్ట అనే పేరుతో ఉందని గుర్తించారు. అయితే దీనికి పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. ఇది కోడిగుడ్ల వెంకటరమణ అనే ప్రైవేటు వ్యక్తిదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories