CM Jagan Remembers PV Narasimha Rao: పీవీ సేవలను భావితరాలు గుర్తించుకుంటాయి : ఏపీ సీఎం జగన్

CM Jagan Remembers PV Narasimha Rao: పీవీ సేవలను భావితరాలు గుర్తించుకుంటాయి : ఏపీ సీఎం జగన్
x
Highlights

CM Jagan remembers PV Narasimha Rao: దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు ఆమోఘమని అన్నారు.

CM Jagan remembers PV Narasimha Rao : దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు ఆమోఘమని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ జగన్ ఆయన సేవలను కొనియాడారు.. పీవీ నరసింహారావు బహుభాషా పండితుడు అని చాలా ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారని, ఆయన ఓ గొప్ప రాజనీతిజ్ఞుడని జగన్ అన్నారు. ఆయన చేసిన సేవలను భావితరాలు కూడా గుర్తించుకుంటాయని జగన్ అన్నారు.. ఇక పీవీ నరసింహారావు వందో జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు..భౌతికంగా పీవీ లేనప్పటికి ఆయన చేసిన సేవలను దేశం మొత్తం గుర్తుపెట్టుకుంటుందని కొనియాడుతున్నారు..

ఇక అటు తెలంగాణ ప్రభుత్వం పీవీ వందో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి వద్ద జరిగిన శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు..శతజయంత్యుత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇక విదేశాల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేపట్టారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇక పీవీ నరసింహారావు వ్యక్తిగత విషయాలకు వస్తే .. ఆయన అసలు పేరు పాములపర్తి వేంకట నరసింహారావు ..ఆయన జూన్ 28 1921 లో అప్పటి కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు..1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరారు.. ఇక 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు.1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు..

ఇక 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికై చరిత్ర సృష్టించారు పీవీ.. అంతేకాకుండా ప్రధానమంత్రి గా కూడా ఎన్నికై అనేకమైన ఆర్ధిక సంస్కరణాలు చేశారు. కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకు ఉన్న అపార అనుభవం ఆయనకి ప్రధానిగా ఉన్న సమయంలో చాలా ఉపయోగపడ్డాయి..ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రు, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే కావడం మరో విశేషం.. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం అతను రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories