logo

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
Highlights

సెప్టెంబర్‌ నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతోన్న ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డి, అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని...

సెప్టెంబర్‌ నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతోన్న ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డి, అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్న వైఎస్ జగన్‌ ప్రస్తుతం దేశం మొత్తం ఏపీ వైపే చూస్తోందన్నారు. 11 నెలల కాలానికి గ్రామ సచివాలయం నుంచి కౌలు రైతులకు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు కార్డులు అందగానే రైతు భరోసా పథకానికి వారు అర్హులవుతారని సీఎం వివరించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి కృష్ణా జలాలు వచ్చాయని పేర్కొన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెరువులు నింపాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఉగాది నాటికి ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదన్నారు.


లైవ్ టీవి


Share it
Top