అనాథగా మారిన పసిబిడ్డను ఆలించిన కలెక్టర్

అనాథగా మారిన పసిబిడ్డను ఆలించిన కలెక్టర్
x
Highlights

కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతుర్నే తల్లిదండ్రులు చంపేస్తే అనాథగా మారిన ఏడు రోజుల పసిబిడ్డను చిత్తూరు జిల్లా సబ్‌కలెక్టర్ కీర్తి అక్కున...

కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతుర్నే తల్లిదండ్రులు చంపేస్తే అనాథగా మారిన ఏడు రోజుల పసిబిడ్డను చిత్తూరు జిల్లా సబ్‌కలెక్టర్ కీర్తి అక్కున చేర్చుకున్నారు. పసిబిడ్డను ఒడిలో తీసుకొని ఆలించారు. హేమావతి భర్త కేశవులకు, బిడ్డకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. బిడ్డ పేరుతో ప్రభుత్వం తరపున ఐదు లక్షలు ఫిక్సిడ్‌ డిపాజిట్ చేస్తామని తెలిపారు.

మృతురాలి భర్త కేశవులు, కుటుంబసభ్యులతో సబ్‌కలెక్టర్ కీర్తి చర్చలు జరిపారు. మృతురాలి చంటిబడ్డకు 5 లక్షలు పరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. భాస్కర్‌నాయుడు ఆస్తిలో కూతురు హైమవతికి వాటా వచ్చేలా సబ్‌కలెక్టర్ కీర్తి హామీ ఇచ్చారు. కేసును ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తామని ఆమె చెప్పారు. ప్రభుత్వ హామీతో ప్రజా సంఘాలు ఆందోళన విరమించాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories