చిరంజీవి బీజేపీలోకి వస్తారా?.. మాజీ మంత్రి ఏమన్నారంటే..

చిరంజీవి బీజేపీలోకి వస్తారా?.. మాజీ మంత్రి ఏమన్నారంటే..
x
Highlights

ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తామని చెప్పుకొస్తున్న బీజేపీ ఆ దిశగానే పావులు కదుపోతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతల వలసలను భారీగానే...

ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తామని చెప్పుకొస్తున్న బీజేపీ ఆ దిశగానే పావులు కదుపోతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతల వలసలను భారీగానే ప్రోత్సహిస్తోంది బీజేపి. కాగా తాజాగా తెలుగుదేశం నుండి పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటు జనసేన పార్టీ నుండి కుడా వలస పర్వం కోనసాగుతునే ఉంది. జనసేనకు గుడ్ బై చెప్పిపలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే జోష్‌లో ఉన్న బీజేపీ ఏపీ నుండి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కాషాయం బాటలోనే నడుస్తూ.. కలిసి పనిచేస్తారని, ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో బైఠక్ అయిన కమలనాథులు ఇప్పటినే చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కుడా బీజేపీ గూటికిలోకి చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆసక్తి రేపుతోంది. చిరంజీవి బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని మాణిక్యాలరావు అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పై విధంగా మాణిక్యాలరావు సమాధానం ఇచ్చారు. అలాగే మొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్య సమావేశంలో చర్చించిన వివరాలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వైసీపీ సర్కార్ పై పోరాటానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్రమోడీ అవినీతిరహిత పాలన, మోడీ ప్రవేశపెడుతున్న పథకాలు, ప్రజల శ్రేయస్సు కోరకు పనిచేస్తున్న మోడీ పాలన చూసి దేశం ఇప్పటికే చాలా మంది బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.

అయితే గత2009 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆ పార్టీ అధినేత చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, గత2014 ఎన్నికల తర్వాత మళ్లీ సినీ రంగంపై రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఇక అప్పటి నుండి కాంగ్రెస్ కలిసి అంతతంత మాత్రంగానే టచ్ లో ఉన్నారు. కాగా ఇటివల ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు ముందే చిరంజీవి కాంగ్ ని వీడీ కాషాయం జెండా కప్పుకుంటారని జోరుగానే ప్రచారం సాగింది. కానీ చిరు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. మొత్తానికి చిరు బీజేపీ గూటికి చేరుతారా లేదా అన్నది అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు పైడికొండల మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories