జగన్ అపాయింట్ మెంట్ కోరిన చిరంజీవి... ఈనెల 14న అపాయింట్మెంట్ ఇచ్చిన జగన్

జగన్ అపాయింట్ మెంట్ కోరిన చిరంజీవి...  ఈనెల 14న అపాయింట్మెంట్ ఇచ్చిన జగన్
x
Highlights

ఒకరు సినిమాల్లో మెగాస్టార్ మరొకరు రాజకీయాల్లో సూపర్ స్టార్ రాజకీయంగా ఇద్దరూ ప్రత్యర్ధులు.. వారే చిరంజీవి, జగన్.. ఆ ఇద్దరూ ఇప్పుడు లంచ్ కోసం భేటీ...

ఒకరు సినిమాల్లో మెగాస్టార్ మరొకరు రాజకీయాల్లో సూపర్ స్టార్ రాజకీయంగా ఇద్దరూ ప్రత్యర్ధులు.. వారే చిరంజీవి, జగన్.. ఆ ఇద్దరూ ఇప్పుడు లంచ్ కోసం భేటీ అవుతున్నారు.. అవును ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి కలవబోతున్నారు. అదీ ఒక విందు సమావేశంలో చిరంజీవి కోరిక మేరకు ఈనెల 14న జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు అధికార వర్గాలు థృవీకరించాయి. దీనికి ముందు వీరు రేపు ఉదయం కలవనున్నారని వార్తలు వచ్చాయి. అయితే సైరా సినిమా చూడమని కోరేందుకే చిరు జగన్ ను కలుస్తున్నారా లేక మరే ఇతరముఖ్యమైన అంశమైనా ఉందా? ఇదే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'ని చూసేందుకు రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. 'సైరా' సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.

చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..ఈ సమయంలో s. v రంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి గంటా, చిరంజీవి కలిసి వెళ్ళటం మళ్ళీ ఇప్పుడు సీఎం ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇది సైరా సినిమా సాకు మాత్రమే అని నిజానికి గంటా ని పార్టీ లోకి తీసుకువెళ్లేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories