Top
logo

ఎగిరే పతంగుల వెనుక పొంచివున్న ప్రమాదం: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా!

ఎగిరే పతంగుల వెనుక పొంచివున్న ప్రమాదం: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా!
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

గాలిపటాలు ఎగరవేసే సీజన్ వచ్చేసింది... ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

గాలిపటాలు ఎగరవేసే సీజన్ వచ్చేసింది... ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతే కాదు... రోడ్డున వెళ్తున్న సమయంలో... అడ్డుగా మాంజా ఉందేమో గమనిస్తే మంచిది. ఎందుకంటే గాలిపటాలకు ఎగురవేసేందుకు వినియోగిం చే మాంజాదారం ఓ బాలుడు ప్రాణాలు తీసింది. దీంతో గుంటూరులో విషాదం నెలకొంది.

గాలిపటం మాంజాదారం మెడకు చుట్టుకోవడంలో మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. లాంచస్టర్‌ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా... బాలుడి దారం మెడకు చుట్టుకోవడంతో మెడ కట్‌ అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు పెద్దయ్యాక డాక్టర్‌ చేద్దామనే ఆలోచనతో ఉన్న తండ్రికి తీరని శోకం మిగిలింది.

కైట్స్‌ సందడి మొదలైంది. చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు. గాలిపటాల్లా గాల్లో తెలిపోతారు. కానీ ఆ పతంగులకు ఉపయోగించే చైనా మాంజా దారం ప్రాణాలను హరిస్తోంది. పక్షులకు ప్రాణగండంగా మారిన ఈ మాంజా.. చూసేందుకు చిన్న దారమే అయినా దానికి పదును ఎక్కువ. నైలాన్‌ మాటున నైసుగా కాటు వేస్తోంది. మాయ చేసి మనుషుల ప్రాణాలను కూడా తీస్తోంది. మాంజా మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వాటిని వాడకం మాత్రం తగ్గడం లేదు.

పతంగిని పైపైకి ఎగరుతుంటే.. యువత తెగ ఎంజాయ్‌ చేస్తోంది. ఇక పక్క వాడి కైట్‌ను కట్‌ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరంటూ కాలర్‌ ఎగరేస్తారు. పెద్ద పెద్ద కైట్‌ను కంట్రోల్‌ చేసేందుకు చైనా మంజానే కరెక్ట్‌ అని డిసైడ్‌ అయిన కైట్‌ లవర్స్‌... బ్యాన్‌ చేసినా మాంజాలను కొనేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. పక్కోడికి ఏమైనా పర్వాలేదు.. మన సరదాతీరితే చాలు అన్న కమిట్‌మెంట్‌తో కొనేస్తున్నారు.

మార్కెట్‌లో డేంజర్‌ మాంజా రాజ్యమేలుతోంది. సిక్రేట్‌గా దందా సాగుతోంది. కంట్రోల్‌ చేసేందుకు రూల్స్‌ ప్రవేశపెట్టినా వాటిని బ్రేక్‌ చేసి మరి అమ్ముతున్నారు...జనం కొట్టున్నారు. చైనా మాంజాలు నైలాన్ తో తయారు చేయడమే కాకుండా బాగా క్రషింగ్ చేసిన గ్లాసు పూతను తయారీలో వినియోగిస్తున్నారు. వీటితోపాటు రాగి లాంటి వాటిని వాడటం వల్ల ఈ ధారం ధృడంగా, పదునుగా ఉంటుంది. దీంతో గాలిపటాల ఎగురవేత సమయంలో మూగజీవాలు, పక్షులు ప్రమాదాల బారినపడుతున్నాయి. ప్రతిఏటా సంక్రాంతి సీజన్లో మాంజా చుట్టుకుని పక్షులు తీవ్రంగా గాయపడుతున్నట్టు తర్వాత మరణిస్తున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో తెలంగాణలో 2017 నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, 10 వేల జరిమానా విధించారు. మూడేళ్లక్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్‌లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

చైనా మాంజా వల్ల కమ్యూనికేషన్, విద్యుత్, ట్రాఫిక్ కి కూడా తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఇది భూమిలో కలిసేది కూడా కాకపోవడంతో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో పర్యావరణవేత్తలు, అటవీశాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. అయినా మార్కెట్లో బహిరంగంగానే అమ్మకాలు సాగుతున్నాయి. ప్రభుత్వం వీటి అమ్మకాలపై దృష్టిపెట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
Web TitleChinese Manja Creating Terror
Next Story