Top
logo

ముద్రగడకు చినరాజప్ప కౌంటర్..దమ్ముంటే..

ముద్రగడకు చినరాజప్ప కౌంటర్..దమ్ముంటే..
X
Highlights

కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చిన రాజప్ప....

కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చిన రాజప్ప. కేసులకు భయపడి ముద్రగడ ఉద్యమాలు చేయడం లేదన్నారు. దమ్ముంటే బయటకు వచ్చి ఉద్యమం చేయాలని సవాలు విసిరారు చినరాజప్ప. చంద్రబాబుకు లేఖలు రాయడం వల్ల ప్రయోజనం లేదని మీ లేఖలు, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరన్నారాయన. టీటీడీ పాలకమండలిపై మాట్లాడుతూ అదో జంబోజెట్‌లా ఉందన్నారు. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం పాలక మండలిలో నేరచరిత్ర ఉన్న వారికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. పైగా ఏపీ కంటే ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఉండడం మరీ విడ్డూరమన్నారు.

Next Story