బాబు ఇంటికి దారెటు..?

బాబు ఇంటికి దారెటు..?
x
Highlights

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఉండవల్లి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మకాం మార్చే ఆలోచన చేస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేయడంతో...

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఉండవల్లి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మకాం మార్చే ఆలోచన చేస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి వేయడంతో చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చివేస్తారనే సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు మరో ఇంటికోసం అణ్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అనువైన నివాసం దొరికిన వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై గుర్రుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసం కూడా ఖాళీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కొత్త ఇంటి కోసం అణ్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజావేదిక కూల్చి వేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కూడా కూల్చే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమే అంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పరోక్షంగా దాన్ని కూడా కూల్చివేయక తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.

నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు నివాసం ఏర్పరుచుకున్నారని, వెంటనే చంద్రబాబు ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజావేదిక కూల్చివేత పనులు పరిశీలించిన ఆర్కే గతంలో ఉండవల్లి ప్రాంతంలో రైతులను బెదిరించి కొందరు భూములను స్వాధీనం చేసుకున్నారని ఆ ప్రాంతంలోనే లింగమనేని గెస్ట్‌హౌస్, ప్రజావేదిక భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు.

ఇళ్లు ఖాళీచేయాలంటూ ఆదేశాలు జారీకాక ముందే గుంటూరు, విజయవాడకు త్వరగా చేరుకునే విధంగా తన నివాసం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలోనే మరో ఇంటి కోసం అణ్వేషిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కొందరు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబుకు స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం కూల్చివేయడానికి వెంటనే పూనుకుంటుందా కోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందా అన్నది తేలాల్సి ఉంది. కూల్చివేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఉపేక్షించేట్లు కన్పించడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories