Chandrababu: ఈనెల 17న ప్రకాశం జిల్లా ఇంకొల్లులో చంద్రబాబు సభ

Chandrababu: పోలీసులతో కలిసి వైసీపీ కుట్రపన్నుతోందని టీడీపీ నేతల ఆగ్రహం

Shekhar G
Published on: 15 Feb 2024 1:47 PM IST
Chandrababu Sabha In Inkollu Of Prakasam District On 17th Of This month
X

Chandrababu: ఈనెల 17న ప్రకాశం జిల్లా ఇంకొల్లులో చంద్రబాబు సభ

Chandrababu: ప్రకాశం జిల్లా ఇంకొల్లు లో ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆపార్టీ ఆరోపిస్తోంది. కలెక్టర్, ఎస్పీలకు సభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులతోపాటు సైతం చేశామని,. దీంతోపాటు అధినేత రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బి అధికారులకు దరఖాస్తు చేశామని చెబుతున్నారు,

ఇంకొల్లు లోని ఓ రైతు దేవాదాయ శాఖ భూములను లీజుకు తీసుకోవడంతో ఆ స్థలంలో సభ నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులకు రైతుల సమ్మతితో దరఖాస్తు చేసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తారక రామ విజయభేరి ప్రాంగణంగా నామకరణం చేసి భూమి పూజ కార్యక్రమాన్ని సైతం కనులు పండుగ నిర్వహించారు. భూమిని చదును చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, త రాత్రి సమయంలో దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని, పనులు నిలిపివేయాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ నేతలంటున్నారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు కాపీని అడిగినప్పటికీ స్పందించకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సభ నిలిపివేసేందుకు ప్రభుత్వ శాఖలతో కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story