కరెంట్ బిల్లుల్ని పెంచి మోసం చేశారు.. వైసీపీ తీరుపై చంద్రబాబు ఆగ్రహం!

కరెంట్ బిల్లుల్ని పెంచి మోసం చేశారు.. వైసీపీ తీరుపై చంద్రబాబు ఆగ్రహం!
x
Chandrababu Naidu(File photo)
Highlights

ఏపీలో ఒకపక్కా కరోనా కేసులు పెరుగుతున్నా కొద్దీ అదే స్థాయిలో రాజకీయ నాయకులు మధ్య కూడా మాటలు కూడా పెరుగుతున్నాయి.

ఏపీలో ఒకపక్కా కరోనా కేసులు పెరుగుతున్నా కొద్దీ అదే స్థాయిలో రాజకీయ నాయకులు మధ్య కూడా మాటలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని, విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసమని చంద్రబాబు అన్నారు.

అంతేకాకుండా లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలి. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పెరిగిన బిల్లుల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు.

లాక్‌డౌన్‌తో జనాలు ఇళ్లలోనే ఉన్నారని.. ఎలాంటి పనులు లేవని.. శ్లాబులు మార్చి పెంచిన బిల్లుల్ని సామాన్యుడు కట్టగలడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ వ్యక్తికి వచ్చిన బిల్లుల్ని ట్వీట్ చేశారు. అందులో అతని గత రెండు నెలలు కరెంట్ బిల్లు రూ.300 వరకు ఉంటే.. ఈ నెలలో ఇచ్చిన బిల్లు మాత్రం రూ.3వేలకు పెరిగింది. ఇక భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత దీక్షకు దిగారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories