Top
logo

సభలో నవ్వులు పూయించిన చంద్రబాబు

సభలో నవ్వులు పూయించిన చంద్రబాబు
Highlights

హాట్‌ హాట్‌గా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నవ్వులు పూయించారు. గోదావరి జలాల...

హాట్‌ హాట్‌గా సాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నవ్వులు పూయించారు. గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చంటూ అధిపార్టీ ఆఫర్ చేయడంపై వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ అభిమానం చూస్తుంటే, ఆశ్చర్యమేసిందంటూ సెటైర్లు వేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వడంపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. వైసీపీకి తనపై చాలా అభిమానం ఉన్నట్టుందని ఎంత అభిమానమంటే అది చూసి తనకే ఆశ్చర్యమేస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీలో మార్పు చాలా వచ్చింది తనకు చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు అనడంతో సభ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది. బాబు మాటలకు సీఎం జగన్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అయితే, బాబు కామెంట్స్‌‌కు అదే రీతిలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ కూడా సెటైర్లతో కౌంటరిచ్చారు.


లైవ్ టీవి


Share it
Top