కార్యకర్తల సేవాభావం మరువలేనిది: చంద్రబాబు నాయుడు

కార్యకర్తల సేవాభావం మరువలేనిది: చంద్రబాబు నాయుడు
x
Highlights

తెలుగుదేశం పార్టీ 'మహానాడు' ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. బుధ,...

తెలుగుదేశం పార్టీ 'మహానాడు' ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. బుధ, గురువారాల్లో ఈ సారి మహానాడు జరగబోతోంది. ఎప్పుడూ అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకను కరోనా నేపధ్యంలో ఆన్ లైన్ వేడుకగా నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు జూమ్‌ వెబినార్‌ ద్వారా ప్రసంగించారు.

ముందుగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మృతులకు సంతాపం ప్రకటించిన మహానాడు. బాధితులకు పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు చంద్రబాబు. మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమన్న ఆయన శారీరకంగా మానసికంగా, ఆర్థికంగా కార్యర్తలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా పార్టీని వదలలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి, చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులను బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories