ఎంతో ప్రాధాన్యమిచ్చాం.. అయినా వారెందుకు దూరం అయ్యారు?

ఎంతో ప్రాధాన్యమిచ్చాం.. అయినా వారెందుకు దూరం అయ్యారు?
x
Highlights

తెలుగుదేశం పార్టీలో ఓటమిపై పోస్ట్ మార్టం మొదలైంది. నిజానికి ఎప్పుడో ఈ పని మొదలు అయినా.. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ...

తెలుగుదేశం పార్టీలో ఓటమిపై పోస్ట్ మార్టం మొదలైంది. నిజానికి ఎప్పుడో ఈ పని మొదలు అయినా.. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ నాయకులు ప్రత్యేకంగా సమావేశం కావడంతో పార్టీలో ఎదో జరగబోతోందన్న పుకార్లు బయలుదేరాయి. సోషల్ మీడియాలో వీటిపై విస్తృతంగా టీడీపీ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కాపు సామజిక వర్గ నాయకులు చంద్రబాబుతో ఉండవల్లి లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి కాపు సామాజిక వర్గం ఎందుకు దూరం అయిందన్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి టీడీపీ కాపు నాయకులు తీసుకువచ్చారు.

కాపుల సంక్షేమానికి మరే ప్రభుత్వమూ ఇవ్వనంత అధిక ప్రాధాన్యమిచ్చింది మన పార్టీనే. కాపు కార్పొరేషన్‌, ప్రత్యేక రిజర్వేషన్లు, బీసీల్లో చేర్చడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. అయినా ఆ వర్గంలో సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను చూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆ వర్గం నాయకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ముద్రగడ దీక్ష సమయంలో సమర్థవంతంగా వ్యవహరించకపోవడం, పోలీసులు దుడుకుగా వ్యవహరించడం వాంతి అంశాలు కాపుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. కాపులకు నమ్మకం కలిగించే విధంగా నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడమే ముఖ్యకారణంగా వారు చంద్రబాబుకు స్పష్టం చేశారు. సారిన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పారు. వారు చెప్పిన విషయాల్ని విన్న చంద్రబాబు అన్ని విషయాల్ని పరిగణన లోకి తీసుకుని లోపాల్ని సవరించుకుందాం అని చెప్పారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టొద్దు. ఇటువంటివి పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయి. ఏదైనా ఉంటే నేరుగా నాదృష్టికి తీసుకురావాలని వారికి చంద్రబాబు సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories