నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరు ఉహించనంతగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లనేతో సరిపెట్టుకుంది....

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరు ఉహించనంతగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లనేతో సరిపెట్టుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరు ఉహించని విధంగా జయకేతనం ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరి నుండి పోటీ చేసి ఓటమిపాలైన విషయం కూడా తెలిసిందే.

అయితే వైసీపీ జయకేతనం ఎగురవేయడానికి గల ముఖ్యకారణాల్లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర, రావాలి జగన్ కావాలి జగన్ పాట, బహిరంగ ప్రచారం, వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ముందు టీడీపీ ప్రచారం సరిపోలేదనే చెప్పవచ్చు. అతి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేసిన ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ హవా సాగింది. కాగా ఇక దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఓటమికి సోషల్ మీడియా కూడా ఒక కారణమే. ఇలాంటి పరిస్థితిల్లో వచ్చే ఎన్నికలకు పావులు కదుపుతోంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా బాధ్యతలను తన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తే టీడీపీకి లాభిస్తుందని భావించి చంద్రబాబు లోకేష్ కు సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యాకలాపాలు కొనసాగించాలని, అవసరమైన ప్రచారం చేయ్యాలని బాధ్యతను అప్పగించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ బాబు తన ట్విట్టర్‌ను తెగ వాడేస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చర్చ సాగేలా.. ఈ మాధ్యమాన్ని వినియోగించుకునే క్రమంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories