చంద్రబాబు కాన్వాయ్ లో వాహనాల తగ్గింపు

చంద్రబాబు కాన్వాయ్ లో వాహనాల  తగ్గింపు
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో వాహనాలను తగ్గించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లోని రెండు వాహనాలను తగ్గించాలని...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో వాహనాలను తగ్గించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లోని రెండు వాహనాలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్కార్ట్ వాహనంతో పాటు పైలట్ క్లియరెన్స్ వాహనాన్ని మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ నుంచి తొలగించాలని నిర్ణయించారు.

ఈ విషయంపై తెలుగుదేశం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వ్యవహారాల కమిటీని సంప్రదించిన తరువాతే, ఇటువంటి నిర్ణయాల్ని తీసుకోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెడు ఫలితాల్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ పరిస్థితిలో తాజా నిర్ణయం వెలువడింది. ఏ విధంగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న చంద్రబాబు నాయుడి కాన్వాయ్ లో పైలట్, ఎస్కార్ట్ వాహనాలని తొలగిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories